![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -408 లో... సాగర్ కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని వాళ్ళ మావయ్య పార్టీ ఇచ్చాడు. గవర్నమెంట్ జాబ్ లంచం ఇచ్చి కొన్నాడని భాగ్యం ద్వారా రామరాజుకి తెలిసి పార్టీకి వెళ్ళి అందరిలో నిజం బయటపెడతాడు. అసలు పిలవని పార్టీకి ఎందుకు వచ్చావ్.. నీకు సిగ్గు లేదా ఇక్కడ నుండి వెళ్ళిపోమని రామరాజుని శ్రీనివాసరావు అంటాడు. దాంతో రామరాజు కుటుంబంతో సహా అక్కడ నుండి వచ్చేస్తారు. మరొకవైపు ఆ అమూల్యతో నాకు టార్చర్ గా ఉందని విశ్వ తన ఫ్రెండ్ తో డ్రింక్ చేస్తూ చెప్తాడు.
విశ్వ డ్రింక్ చేసి కోపంగా అమూల్య దగ్గరికి వస్తాడు. అమూల్య నిద్రపోతుంటుంది. తన దగ్గరికి వెళ్లి ఇది కూడా అందంగానే ఉంది. ఈ రోజుతో ఈ అందం నా సొంతం కావాలని తనపై చెయ్ వేస్తుంటే ఒక్కసారిగా లేచి తనని కొడుతుంది. ఏంటే నీ భర్తని గదిలోకి వచ్చానని విశ్వ అంటాడు. దగ్గరికి వస్తే చంపేస్తానని చున్నీ తీసుకొని తన మెడకి చుడుతుంది. దాంతో విశ్వ భయంతో పారిపోతాడు. మరొకవైపు రామరాజు ఇంట్లో భాగ్యం పెట్టిన చిచ్చు రాజుకుంది. ఎంత ధైర్యంరా వనజ ఇచ్చిన డబ్బు కొట్టేసి జాబ్ తెచ్చుకొని.. పెళ్ళాం నగలు పెట్టి డబ్బు తెచ్చావ్.. కొంచెం కూడా సిగ్గు లేదా అని సాగర్ ని వేదవతి కొడుతుంది. ఇరవై లక్షలు కాదు అత్తయ్య ఇరవై అయిదు లక్షలని శ్రీవల్లి అంటుంది. ఇంకా అయిదు లక్షలు ఎక్కడివి అని వేదవతి అడుగుతుంది. రైస్ మిల్ నుండి తీసానని సాగర్ అనగానే ఏవండి ఇప్పుడు రైస్ మిల్ బాధ్యతలు మీవే కదా అడగండి అని చందుతో శ్రీవల్లి అంటుంది. ఒరేయ్ నీకు సిగ్గు లేదా తప్పు మీద తప్పు చేస్తున్నావని చందు కోప్పడతాడు.
ఇక నువ్వు ఆ జాబ్ చెయ్యకని రామరాజు అంటాడు. చేస్తానని సాగర్ అంటాడు. నాన్న మాటకే ఎదురు చెప్తావా అని సాగర్ ని వేదవతి కొట్టబోతుంటే నర్మద అడ్డుపడి ఆపుతుంది. నేను సర్ది చెప్తాను అత్తయ్య అని నర్మద అనగానే అసలు దీనంతటికి కారణం నువ్వే అని నర్మదని వేదవతి కొడుతుంది. నా భార్య తప్పేముంది. నాకు మిల్ లో పని చెయ్యడం ఇష్టం లేదని సాగర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |